Thu Mar 19 2026 08:53:46 GMT+0530 (India Standard Time)
యూనియన్ బ్యాంక్ లో అగ్నిప్రమాదం
గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బ్యాంకు అంతా మంటలు..

అన్నవరం : తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో గల యూనియన్ బ్యాంక్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బ్యాంకు అంతా మంటలు వ్యాపించడంతో.. స్థానికులు సంబంధిత అధికారులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. అగ్నిప్రమాదంలో బ్యాంకులో ఉన్న ఫర్నిచర్, ఇతర సామాగ్రి ఆహుతైనట్లు సమాచారం. నగదు, విలువైన డాక్యుమెంట్స్ ను భద్రపరిచే లాకర్ సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో ఎంత నష్టం జరిగింది ? ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా ? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
Next Story

