Wed Jan 21 2026 04:55:57 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం
విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్తి నష్టం యాభై లక్షల వరకూ ఉంటుందని అంచనా వినపడుతుంది.

విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్తి నష్టం యాభై లక్షల వరకూ ఉంటుందని అంచనా వినపడుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉక్కుద్రవం నేలపాలు కావడంతో పెద్దయెత్తున మంటలు వ్యాపించాయి. ఈ మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. బీఎఫ్ యూనిట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
50 లక్షల నష్టం....
అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తుంది. అగ్ని ప్రమాదం కారణంగా యాభై లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విచారణకు ఆదేశించింది.
Next Story

