Sat Dec 06 2025 00:48:17 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం
రెండంతస్తుల వరకూ మంటలు ఎగసి పడుతున్నాయి. ప్రమాద స్థలానికి దగ్గర్లో గోవిందరాజస్వామి ఆలయానికి..

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ కు సమీపంలో ఉన్న గాంధీ రోడ్ లో ఉన్న ఫొటో ఫ్రేమ్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. రెండంతస్తుల వరకూ మంటలు ఎగసి పడుతున్నాయి. ప్రమాద స్థలానికి దగ్గర్లో గోవిందరాజస్వామి ఆలయానికి చెందిన రథం ఉండటంతో పోలీసులు, టీటీడీ అప్రమత్తమయ్యారు. ఘటనా ప్రాంతానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.
మంటలు మరింత పెరిగితే రథానికి నిప్పంటుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రథాన్ని అక్డి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా గాంధీనగర్ - రైల్వే స్టేషన్ రోడ్లలో యాత్రికులు రాకుండా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. మాఢవీధుల్లో రాకపోకలను నిలిపివేశారు. కాగా.. ప్రమాదం జరిగిన దుకాణంలో కార్మికులెవరైనా ఉన్నారా ? ప్రాణనష్టం జరిగిందా ? అని తెలియాల్సి ఉంది.
Next Story

