Sat Jan 31 2026 15:43:50 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడలో తగలబడ్డ 300 బైక్స్
ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి.

విజయవాడ నగరంలో భారీ అగ్నిప్రమాదం విజయవాడలోని కేపీనగర్లోగల గురువారం తెల్లవారు జామున టీవీఎస్ వాహనాల షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చెన్నై-కోల్‌కతాపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఈ షోరూం ఉంది. ఒక్కసారిగా మంటలు వేగంగా వ్యాపించడంతో షోరూంలోని 300 వరకూ వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. సర్వీస్ సెంటర్, గోడౌన్ కూడా ఇదే ప్రాంతంలో ఉండటంతో పెద్ద సంఖ్యలో వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూం మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు.. తర్వాత గోదాముకూ విస్తరించాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. ఫ్రీఫ్యాబ్రిక్ పద్ధతిలో షోరూం నిర్మించారు. గోదాములో ఎలక్ట్రిక్ట్ వాహనాలు కూడా ఉన్నాయి. పెట్రోల్ వాహనాలకు సమీపంలోనే ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ పెట్టి ఉంచారని కూడా అనుమానిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచారణ మొదలుపెట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

