Fri Dec 05 2025 11:41:06 GMT+0000 (Coordinated Universal Time)
Payyavula : జగన్ సభకు రావాలి.. సమస్యలపై చర్చించాలి
వైసీపీ అధినేత జగన్ శాసనసభకు రావాలని కోరుకుంటున్నామని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

వైసీపీ అధినేత జగన్ శాసనసభకు రావాలని కోరుకుంటున్నామని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ సభకు వచ్చి సమస్యలపై మాట్లాడాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ప్రజల కోసం, ప్రజా సంక్షేమానికి సభ అనిపించేలా సమావేశాలను నిర్వహించనున్నామని పయ్యావుల కేశవ్ తెలిపారు.
ఆర్థిక పరిస్థితిపై...
సభలో విపక్షమైనా, స్వపక్షమైనా తామేనని ఆయన అన్నారు. ప్రజల కోసం తాము ఏ పాత్ర పోషించడానికైనా తాము సిద్ధం అని ఆయన అన్నారు. ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాతనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి పిక్చర్ వస్తుందని ఆయన తెలిపారు. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పయ్యావుల కేశవ్ తెలిపారు.
Next Story

