Fri Dec 05 2025 14:14:29 GMT+0000 (Coordinated Universal Time)
Ananthapuram : జగన్, పవన్, చిరు, జూనియర్ ఎన్టీఆర్ ఓకే.. పరిటాల రవి కూడా వచ్చారట
అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రజా దర్బారులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు వింత అనుభవం ఎదురైంది.

అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రజా దర్బారులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు వింత అనుభవం ఎదురైంది. ఉరవకొండ గ్రంథాలయంలో ఇటీవల పుస్తకాలు చదివినట్లుగా రికార్డులలో జగన్, చంద్రన్న, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవితో పాటు ఎప్పుడో చనిపోయిన దివంగత నేత పరిటాల రవి పేరు కనిపించడంతో మంత్రి పయ్యావుల కంగుతున్నారు. తనకు తెలియకుండా వీరందరూ తన నియోజకవర్గం ఉరవకొండకి ఎప్పుడు వచ్చారా అని.. అవాక్కయ్యారు. ప్రజాదర్బార్‌లో ఉరవకొండ గ్రంథాలయం శిథిలమైపోయిందని… గ్రంథాలయం మరమ్మత్తులు చేయడానికి చర్యలు తీసుకోవాలంటూ గ్రంథాలయ ఉద్యోగి ప్రతాపరెడ్డి మంత్రి పయ్యావుల కేశవ్‌కు వినతి పత్రం అందజేశారు.
రికార్డులను పరిశీలించడానికి...
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్.. గ్రంథాలయానికి ఎవరైనా చదువుకోడానికి వస్తున్నారా?? అని సదరు ఉద్యోగిని ప్రశ్నించారు. రోజుకు 50 నుంచి 60 మంది వరకు గ్రంథాలయానికి పుస్తకాలు చదువుకోడానికి వస్తున్నారని గ్రంథాలయ ఇన్చార్జ్ ప్రతాపరెడ్డి సమాధానం ఇచ్చారు. రోజుకి 60 మంది గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదువుకుంటున్నారని చెప్పడంతో అనుమానం వచ్చిన మంత్రి పయ్యావల కేశవ్.. రికార్డు తీసుకురావాలని అడిగారు. రికార్డులు పరిశీలించిన మంత్రి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందులో పవన్ కళ్యాణ్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, జగన్, చంద్రన్నతో పాటుగా… పరిటాల రవి కూడా లైబ్రరీకి వచ్చినట్లు రికార్డుల్లో పేర్లు ఉన్నాయి దీంతో ఆగ్రహించిన మంత్రి పయ్యావుల కేశవ్ లైబ్రరీలోని రికార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలంటూ పోలీసులను ఆదేశించారు. ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగుల పనితీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ అసహనం వ్యక్తం చేశారు
Next Story

