Sun Feb 01 2026 08:13:15 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ పాదయాత్ర పేరు ఏంటంటే?
నారా లోకేష్ పాదయాత్ర పేరు ను పార్టీ ఖరారు చేసింది. యువగళం పేరుతో లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు.

నారా లోకేష్ పాదయాత్ర పేరు ను పార్టీ ఖరారు చేసింది. యువగళం పేరుతో లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. జనవరి 27వ తేదీ నుంచి లోకేష్ పాదయాత్ర కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుంది. నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేరకు లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది.
2024 మార్చి వరకూ...
ఈ పాదయాత్ర పేరును యువగళం పేరుతో చేస్తున్నారు. ప్రధానంగా యువతను ఆకట్టుకునే విధంగా పాదయాత్రకు నామకరణం చేశారు. యువత, మహిళల ఓట్లు లక్ష్యంగా పాదయాత్ర కొనసాగనుంది. 2023 జనవరి నుంచి 2024 మార్చి మొదటి వారం వరకూ పాదయాత్ర కొనసాగే అవకాశముంది.
Next Story

