Wed Jan 21 2026 17:28:31 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీకి పోసాని గుడ్ బై
వైసీపీకి సినీ రచయిత పోసాని కృష్ణమురళి గుడ్ బై చెప్పారు. ఆయన తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు

వైసీపీకి సినీ రచయిత పోసాని కృష్ణమురళి గుడ్ బై చెప్పారు. ఆయన తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వైసీపీనే కాదు తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదని పోసాని కృష్ణమురళి తెలిపారు. తనను ఎవరూ ఏమీ అనలేదని, అలాగే తాను కూడా ఏ పార్టీ నేతలను దూషించలేదని పోసాని కృష్ణమురళి తెలిపారు.
కుటుంబం కోసం...
తాను ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనని ఆయన తెలిపారు. తన కుటుంబం, పిల్లల కోసమే తాను రాజకీయాలను వదిలేస్తున్నానని పోసాని కృష్ణమురళి తెలిపారు. ఇకపై తాను ఎవరి గురించి మాట్లాడనన్న పోసాని కృష్ణమురళి తాను ఓటరు లాగే ప్రశ్నించానని, మంచి చేసినవాళ్లను మాత్రమే పొగిడానని పోసాని కృష్ణమురళి తెలిపారు.
Next Story

