Sun Mar 15 2026 11:33:50 GMT+0530 (India Standard Time)
అందుకే మంత్రివయ్యావన్నా..?
సినీ హీరో నాని వాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ పై సినీ నిర్మాత బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు.

సినీ హీరో నాని వాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ పై సినీ నిర్మాత బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తమకు నాని అంటే ఎవరో తెలియదని, తమకు తెలిసిన నాని కొడాలి నాని మాత్రమే అని ఆయన అన్నారు. అంతటితో ఆగకుండా తాను బైక్ అమ్మి పవన్ కల్యాణ్ కటౌట్లు ఏర్పాటు చేశానని, పవన్ అభిమానుల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
అందుకే అలా....
దీనికి బండ్ల గణేష్ స్పందిస్తూ "అందుకే రాష్ట్రానికి మంత్రివయ్యావన్నా" అంటూ ట్వీట్ చేశారు. పవన్ అభిమానివి కాబట్టే మంత్రివయ్యావని బండ్ల గణేష్ అనిల్ కుమార్ యాదవ్ కు పరోక్షంగా చెప్పారు. దీనిపై పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

