Mon Dec 08 2025 18:05:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగన్ తో చిరంజీవితో పాటు....?
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. సినిమా రంగ సమస్యలతో పాటు టిక్కెట్ ధరలపై వీరు ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ అపాయింట్ మెంట్ ఖరారయింది. ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబుతో పాటు పలువరు సినీ నిర్మాతలు, దర్శకులు పాల్గొనే అవకాశముందని చెబుతున్నారు.
రేట్లు పెంచాలని...
కరోనా పరిస్థితుల వేళ టిక్కెట్ల రేట్లు పెంచాలని వీరు కోరే అవకాశముంది. ఇటీవల ప్రభుత్వం ఏపీలో మూవీ టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి 35 వ నెంబరు జీవో కూడా విడుదల అయింది. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయితే ప్రభుత్వం టిక్కెట్ల ధరల నిర్ణయానికి సంబంధించి కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.
కమిటీ నివేదిక.....
జగన్ తో జరిగే సమావేశంలో ఈ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా బయటపెడతారని తెలిసింది. కమిటీ కూడా టిక్కెట్ల ధరలను పెంచాలని అభిప్రాయపడినట్లు సమాచారం. ఈరోజు హైకోర్టులో కూడా దీనిపై విచారణ జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తో సినీ ప్రముఖల సమావేశం కీలకంగా మారనుంది. ఇటీవల జగన్ ను కలిసి వచ్చిన చిరంజీవి సీనీ రంగ సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story

