Fri Dec 19 2025 02:24:15 GMT+0000 (Coordinated Universal Time)
రేపు చిత్ర పరిశ్రమ బంద్
ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మరణానికి సంతాపంగా రేపు చిత్ర పరిశ్రమ బంద్ చేయనున్నారు

ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మరణానికి సంతాపంగా రేపు చిత్ర పరిశ్రమ బంద్ చేయనున్నారు. ఈ మేరకు చలనచిత్ర మండలి నిర్ణయం తీసుకుంది. రేపు షూటింగ్ లన్నీ బంద్ చేయాలని పిలుపు నిచ్చింది.రామోజీరావు తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష కృషి చేశారని తెలిపింది. ఆయన నిర్మించిన ఫిల్మ్ సిటీ ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది.
చిత్రాలను నిర్మించడమే కాకుండా...
ఎన్నో చిత్రాలను నిర్మించడమే కాకుండా, బుల్లితెర ద్వారా అనేక మంది కొత్త వారికి అవకాశం కల్పించింది కూడా రామోజీరావు అని చలన చిత్రనిర్మాత మండలి తెలిపింది. ఎందరికో అవకాశాలు ఇవ్వడమే కాకుండా, తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని నలుదిక్కులా వ్యాపింప చేసేలా ఆయన తీసుకున్న చర్యలు అనన్య సామాన్యం అని కొనియాడింది.
Next Story

