Sun Mar 15 2026 11:33:50 GMT+0530 (India Standard Time)
Hero Nani : తిరుమలకు కాలినడకన హీరో నాని
సినీ హీరో నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన సినిమా విడుదలకు రెడీ అవుతుంది

సినీ హీరో నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన సినిమా విడుదలకు రెడీ అవుతుండటంతో చిత్ర బృందంతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు తెల్లవారు జామున అలిపిరి మెట్ల నుంచి కాలినడకన బయలుదేరిన నాని టీం తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం నుంచి నాని బయలుదేరాడు.
స్వామి వారిని దర్శించుకుని...
నానిని చూసిన భక్తులు ఆయనతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. తిరుమలకు చేరుకున్న నాని శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆయన స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీర్ధప్రసాదాలను అందచేశారు. ఆయన నటించిన సరిపోదా శనివారం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Next Story

