Thu Mar 19 2026 04:42:52 GMT+0530 (India Standard Time)
జగన్ బాగా రిసీవ్ చేసుకున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సినీ దర్శకుడు రాజమౌళి భేటీ అయ్యారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సినీ దర్శకుడు రాజమౌళి భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని రాజమౌళి చెప్పారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్న దర్శకుడు రాజమౌళి సీఎంతో కాసేపు భేటీ అయ్యారు.
కృతజ్ఞతలు చెప్పేందుకే.....
అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ తనను చక్కగా రిసీవ్ చేసుకున్నారని చెప్పారు. సినిమా టిక్కెట్ల విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చానని ఆయన తెలిపారు. RRR బాగా ఖర్చుతో కూడుకున్న సినిమా అని, దానికి ఏం చేయాలో అది చేస్తామని రాజమౌళి తెలిపారు.
Next Story

