Mon Aug 15 2022 03:12:10 GMT+0000 (Coordinated Universal Time)
నాగబాబుతో పృధ్వీరాజ్ భేటీ.. పార్టీలో చేరేందుకు?

సినీ నటుడు పృథ్వీరాజ్ జనసేన లో చేరనున్నారు. ఆయనను నాగబాబును కలిసి జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు. త్వరలో పవన్ కల్యాణ్ ను ఆయన కలిసే అవకాశముంది. ఆయన ఇంకా జనసేనలో చేరనప్పటికీ ఆ దిశగానే ఆయన ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ ను కలిసిన తర్వాత ఆయన చేరికపై స్పష్టత రానుంది. జనసేనలో చేరబోతున్నట్లు పృధ్వీరాజ్ తన సన్నిహితుల వద్ద ఇప్పటికే చెబుతున్నారు.
పవన్ అంగీకారం కోసం...
ముందుగా పార్టీ నేత నాగబాబును కలిసి తన మనసులో ఉన్న ఉద్దేశ్యాన్ని వివరించినట్లు తెలిసింది. అయితే పృథ్వీరాజ్ ను పవన్ కల్యాణ్ పార్టీలో చేరుకుంటారా? లేదా? అన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. పృధ్వీరాజ్ వైసీపీలో 11 ఏళ్ల పాటు ఉన్నారు. వైసీపీ అధికారంలో రాగానే ఎస్వీబీసీ ఛైర్మన్ గా నియమించారు. అయితే ఆ ఛానల్ లో ఉద్యోగితో రాసలీలల వ్యవహారం బయటపడటంతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి పృధ్వీరాజ్ ను వైసీపీ తొలిగించింది. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసింది. దీంతో పవన్ కల్యాణ్ ఆయనను పార్టీలో చేర్చుకుంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story