Fri Dec 05 2025 11:40:46 GMT+0000 (Coordinated Universal Time)
Posani Krishna Murali : జైలు నుంచి రేపు పోసాని విడుదయ్యే ఛాన్స్
సినీనటుడు పోసాని కృష్ణమురళికి న్యాయస్థానాల్లో ఊరట లభించింది.

సినీనటుడు పోసాని కృష్ణమురళికి న్యాయస్థానాల్లో ఊరట లభించింది. కర్నూలు, విజయవాడ కోర్టుల్లో ఆయనకు బెయిల్ లభించింది. ఇప్పటికే నరసరావుపేట న్యాయస్థానం కండిషన్ బెయిల్ ఇవ్వడంతో పోసాని కృష్ణమురళి రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి కర్నూలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
అన్ని కేసుల్లో...
హైకోర్టును పోసాని కృష్ణమురళి ముందుగానే ఆశ్రయించడంతో ఆయనపై నమోదయిన కొన్ని కేసుల్లో న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఇప్పుడు మూడు కేసుల్లోనూ బెయిల్ లభించడంతో ఆయన రేపు కర్నూలు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. కోర్టు ఉత్తర్వులు జైలు అధికారులకు చేరడంలో ఆలస్యం కావడంతో రేపు ఆయన జైలు నుంచి విడులయ్యే ఛాన్స్ ఉంది.
Next Story

