Fri Dec 05 2025 12:24:54 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నేడు విశాఖలో నందమూరి బాలకృష్ణ
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రోడ్‌షోలు, సభల్లో బాలకృష్ణ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రం విశాఖ నగరంలో జరగనుందని టీడీపీ వర్గాలు తెలిపాయి.సాయంత్రం 3.40కి జాలారిపేట, 4.25 గంటలకు డెయిరీ ఫారమ్ జంక్షన్, 5.10 గంటలకు చినగదిలి జంక్షన్లో రోడ్‌షో నిర్వహించనున్నారు.
రోడ్ షోలు...
సాయంత్రం 5.45కు కంచరపాలెం మెట్టులో బహిరంగ సభ జరగనుంది.7.40 గంటలకు గోపాల పట్నంలో రోడ్‌షో జరగనుంది. అనంతరం కొత్తవలస మీదుగా ఎస్.కోట వెళ్లనున్నారు. హనుమంతువాక నుంచి ఆదర్శనగర్, రవీంద్రనగర్, టి.ఐ.సి.పాయింట్ మీదుగా ఆరిలోవ ఆఖరి బస్‌స్టాప్ వరకు రోడ్‌షో జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

