Fri Mar 20 2026 00:44:38 GMT+0530 (India Standard Time)
సినీనటుడు ఆలీకి ఏపీలో పదవి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా సినీనటుడు ఆలీ నియమితులయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా సినీనటుడు ఆలీ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఆలీకి నామినేటెడ్ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. రాజ్యసభ పదవి ఇస్తారని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. అయితే ఆలీని రాజ్యసభకు మాత్రం ఎంపిక చేయలేదు.
ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా...
దీంతో ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తారని పార్టీ వర్గాలు లీకులు ఇస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటులు ఆలీ వైసీపీ తరుపున పనిచేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి లభించింది.
Next Story

