Thu Mar 19 2026 09:26:18 GMT+0530 (India Standard Time)
తాడేపల్లి నుంచి ఈరోజు పిలుపు వచ్చింది ఎవరెవరికి అంటే?
వైసీపీలో ఐదో జాబితా రెడీ అవుతుంది. ఈ మేరకు కసరత్తులు చేస్తుంది

వైసీపీలో ఐదో జాబితా రెడీ అవుతుంది. ఈ మేరకు కసరత్తులు చేస్తుంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో అనేక మంది నేతలు క్యూ కట్టారు. ఇప్పటికే నాలుగు జాబితాలను వైసీపీ విడుదల చేసింది. మొత్తం పది మంది పార్లమెంటు నియోజకవర్గాలు, యాభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేశారు.
హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు...
ఈరోజు కాకినాడ ఎంపీ వంగా గీత, దర్శి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్, కోడుమూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రి కార్యాలయంలో నేతలతో భేటీ అయినట్లు తెలిసింది.త్వరలోనే ఐదో జాబితాను కూడా జగన్ పార్టీ విడుదల చేసే అవకాశముంది.
Next Story

