Sun Mar 08 2026 02:38:55 GMT+0530 (India Standard Time)
YSRCP : నేడు ఐదో జాబితా విడుదల..ఈసారి ఎన్నంటే?
వైసీపీ అభ్యర్థుల ఐదో జాబితా ఈ రోజు విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి

వైసీపీ అభ్యర్థుల ఐదో జాబితా ఈ రోజు విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని నియజకవర్గాలపై వైసీపీ హైకమాండ్ కసరత్తులు పూర్తి చేసింది. లిస్ట్ రెడీగా ఉండటంతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులలో టెన్షన్ మొదలయింది. ఇప్పటికే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి కొందరు ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు. వారితో చర్చలు జరిపారు. ఐదో జాబితాలో ఎనిమిది నుంచి పది స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరికొందరి ఎమ్మెల్యేలకు...
అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలను పక్కన పెట్టడంతో పాటు మంత్రులలో కొందరికి స్థానం చలనం తప్పేట్లు లేదంటున్నారు. ఎక్కువగా కోస్తాంధ్ర, రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ ఐదో జాబితాలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. తొలి నాలుగు జాబితాల్లో యాభై ఎనిమిది శాసనసభ నియోజకర్గాలు, పది పార్లమెంటు నియోజకవర్గాలలో వైసీపీ హైకమాండ్ మార్పులు చేర్పులు చేపట్టింది. రాత్రికి ఐదో విడత జాబితా విడులయ్యే అవకాశముంది.
Next Story

