Sat Mar 14 2026 14:01:32 GMT+0530 (India Standard Time)
రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య
రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో ఇప్పటి వరకూ పదిహేను మంది మరణించారు

రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో ఇప్పటి వరకూ పదిహేను మంది మరణించారు. మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రాజమండ్రిలో కల్తీపాలు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది. ఇప్పటికే పదిహేను మంది మరణించారు. ఈ కల్తీపాలును పంపిణీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో ఇద్దరి పరిస్థితి...
కల్తీ పాలు తాగిన వారంతా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. గత పది రోజుల నుంచి వరసగా రోజుకు ఒకరు మరణించారు. మొత్తం ఇరవై మంది మాత్రమే కల్తీపాలు తాగి ఆరోగ్యం క్షీణించింది. మిగిలిన ఐదుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఈరోజు హెల్త్ బులిటెన్ లో వైద్యులు వెల్లడించారు. గత నెల 16వ తేదీన రాజమండ్రిలో కల్తీ పాలు ఘటన జరిగింది.
Next Story

