Fri Dec 05 2025 20:29:33 GMT+0000 (Coordinated Universal Time)
సీఆర్డీఏ కార్యాలయంలో రైతుల ఆందోళన
అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనుల కారణంగా భూములు కోల్పోయిన రైతులు సీఆర్డీఏ అధికారులను కలిశారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనుల కారణంగా భూములు కోల్పోయిన రైతులు సీఆర్డీఏ అధికారులను కలిశారు. మందడం, రాయపూడి, వెలగపూడి గ్రామాలలో దేవాలయాలు, స్మశాన వాటికల స్థలాలు కోల్పోయినట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు తగిన పరిష్కారం చూపాలని కోరుతూ సిఆర్డీఏ కార్యాలయంలో జరిగిన సోషల్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయా గ్రామస్తులు తమ ఫిర్యాదులను విన్నవించారు.
సంస్కృతిని కాపాడాలంటూ...
స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ సమక్షంలో, గ్రామస్తులు సిఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబుని కలిసి, కోల్పోయిన దేవాలయాలు, స్మశాన వాటికలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సందర్భంగా, తమ గ్రామాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గ్రామస్తుల ఫిర్యాదులను విని, ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Next Story

