Sun Mar 15 2026 11:54:40 GMT+0530 (India Standard Time)
రైతుల మహాపాదయాత్రకు బ్రేక్
రాజధాని అమరావతి రైతులు మహాపాదయాత్రకు నాలుగు రోజులు విరామం ప్రకటించారు

రాజధాని అమరావతి రైతులు మహాపాదయాత్రకు నాలుగు రోజులు విరామం ప్రకటించారు. తాత్కాలికంగా విరామం ప్రకటించినట్లు అమరావతి పరిరక్షణ సమితి తెలిపింది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తాము యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని తెలిపింది. నాలుగు రోజుల తర్వాత తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుందని రైతులు చెబుతున్నారు.
నాలుగు రోజులు....
న్యాయస్థానంలోనే పోలీసుల తీరుపై తేల్చుకోవాలని రైతులు నిర్ణయించారు. అయితే కోర్టులకు నాలుగు రోజులు సెలవు ఉండటంతో తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. న్యాయస్థానం పెట్టిన షరతులతో పోలీసులు తమను మరింత ఇబ్బంది పెడుతున్నారని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల పాదయాత్ర కొనసాగుతుంది.
Next Story

