Thu Mar 19 2026 01:17:07 GMT+0530 (India Standard Time)
గుడివాడకు రైతుల మహాపాదయాత్ర
ఈరోజు పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుంది.

రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్ర పన్నెండో రోజుకో చేరుకుంది. ఈరోజు పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ఉదయం పెడన నియోజకవర్గానికి చేరుకుంది. మహాపాదయాత్రపై రాళ్ల దాడి చేసే అవకాశముందని పాదయాత్ర నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తమకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. కాగా మహాపాదయాత్రకు మచిలీపట్నం న్యాయవాదుల సంఘం మద్దతు తెలిపింది.
ఫ్లెక్సీలతో ....
రెడ్డిపాలెం మీదుగా ఈరోజు గుడివాడలోకి రైతుల మహా పాదయాత్ర ప్రవేశించనుంది. అయితే రైతుల పాదయాత్ర చేసే మార్గంలో ఫ్లెక్సీలు వెలిశాయి. మేం ఎవరి జోలికి రామని, మా జోలికి వస్తే ఎగరేసి నరుకుతాం అంటూ బ్యానర్లు వెలిశాయి. వైసీపీ యువదళం పేరిట ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. పాదయాత్రకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

