Thu Mar 19 2026 02:59:36 GMT+0530 (India Standard Time)
నేడు మూడో రోజు రైతుల పాదయాత్ర
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతుల మహాపాదయాత్ర నేడు మూడో రోజుకు చేరుకుంది.

అమరావతిలో రాజధానిని కొనసాగించాలంటూ రైతుల మహాపాదయాత్ర నేడు మూడో రోజుకు చేరుకుంది. నేడు దుగ్గిరాల నుంచి తెనాలి మీదుగా పెదరావూరు వరకూ రైతుల పాదయాత్ర కొనసాగనుంది. రైతుల మహాపాదయాత్రకు గుంటూరు జిల్లాలో భారీ స్పందన లభిస్తుంది. ప్రజలు రైతులకు హారతులు పడుతూ తమ గ్రామాల్లోకి స్వాగతం పలుకుతున్నారు.
అమరావతిలోనే....
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ అమరావతి టు అరసవిల్లి వరకూ పాదయాత్ర ను రైతులు కొనసాగిస్తున్నారు. మొత్తం 900 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రకు టీడీపీ, బీజేపీ, వామపక్ష పార్టీ నేతలు మద్దతు తెలుపుతున్నాయి. కొన్ని ప్రజాసంఘాలు కూడా తమ సంఘీభావన్ని తెలుపుతున్నాయి. రోజుకు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది.
Next Story

