Sun Mar 15 2026 13:22:04 GMT+0530 (India Standard Time)
14వ రోజుకు మహా పాదయాత్ర
కృష్ణా జిల్లా నుంచి నేడు ఏలూరు జిల్లాలోకి రైతుల మహా పాదయాత్ర ప్రవేశించనుంది.

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్ర నేడు 14వ రోజుకు చేరకుంది. కృష్ణా జిల్లా నుంచి నేడు ఏలూరు జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. నాగవరప్పాడు నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలోని కొనికి ప్రాంతానికి పాదయాత్ర చేరుకుంటుంది.
ఏలూరు జిల్లాలో...
నిన్న గుడివాడలో కొంత ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు పాదయాత్రకు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామాలు, పట్టణాల నుంచి ఈ యాత్ర అరసవిల్లికి చేరుకోనుంది. మధ్యలో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ రైతులు రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.
Next Story

