Wed Mar 11 2026 15:18:55 GMT+0530 (India Standard Time)
జగన్ కు సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. కిమ్స్ లో సిరివెన్నెలకు జరిగిన వైద్య ఖర్చులన్నీ ఏపీ ప్రభుత్వం భరించనుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన కిమ్స్ లో చేరిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి 30వ తేదీ వరకూ చికిత్స పొందారు. ఆరు రోజుల చికిత్సకు అయిన ఖర్చు ఏపీ ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
ఆసుపత్రి బిల్లులు...
దీనిపై సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యమంత్రి తన తండ్రి పట్ల చూపిన ఆదరణకు ధన్యావాదాలు తెలిపాయరు ఆయన కుమారులు. తమ కుటుంబానికి అండగా నిలిచిన జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story

