Fri Dec 05 2025 20:59:21 GMT+0000 (Coordinated Universal Time)
సాయితేజ చివరి మాటలు అవే
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ చివరి మాటలను కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ చివరి మాటలను కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన నిన్న ఉదయం 8.45 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. పాప దర్శిని, కుమారుడు మోక్షజ్ఞ గురించి ఆరా తీశారు. మోక్షజ్ఞ స్కూలుకు వెళ్లాడా అని భార్య శ్యామలను అడిగారు. తాను తమిళనాడు వెళుతున్నానని, వీలుంటే సాయంత్రం ఫోన్ చేస్తానని సాయితేజ తన భార్య శ్యామలకు చెప్పారు.
ప్రమాదం గురించి...
అదే సాయి తేజ చివరిమాటలు. ఆర్మీహెలికాప్టర్ ప్రమాదానికి గురైందని తెలియగానే కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వారు అనుకున్నట్లే బిపిన్ రావత్ తో కలసి సాయితేజ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురయిందని తెలిసి హతాశులయ్యారు. సాయితేజ మృతితో చిత్తూరు జిల్లా కురుబల కోట మండలం ఎగువ రేగడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయి మరణవార్త తెలిసిన వెంటనే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గత వినాయక చవితి పండగకు సాయితేజ స్వగ్రామానికి వచ్చి వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు.
Next Story

