Thu Mar 19 2026 20:18:35 GMT+0530 (India Standard Time)
నేడు చంద్రబాబుతో ములాఖత్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో నేడు కుటుంబ సభ్యులు ములాఖత్ అవుతున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో నేడు కుటుంబ సభ్యులు ములాఖత్ అవుతున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆయనను రాజమండ్రి జైలులో కలవనున్నారు. నారా భువనేశ్వరి, నారా లోకేష్ తో పాటు బ్రాహ్మణి కూడా చంద్రబాబును కలవనున్నారు. న్యాయస్థానాల్లో కేసుల పురోగతిపై వారు చంద్రబాబుకు వివరించనున్నారు.
రాజకీయ అంశాలతో...
దీంతో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించనున్నారు. జనసేనతో సమన్వయం చేసుకోవడం వంటి అంశాలపై కూడా లోకేష్ ఈ సందర్భంగా చంద్రబాబుతో చర్చించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో దాదాపు నలభై రోజుల నుంచి రాజమండ్రి జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
Next Story

