Fri Dec 05 2025 20:25:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు.. ముగ్గురు మృతి
కడప జిల్లాలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నదులు పొంగుతున్నాయి.

కడప జిల్లాలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నదులు పొంగుతున్నాయి. రామాపురం దగ్గర చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. రోడ్లపైకి వరద నీరు చేరింది. రోడ్డు దాటుతున్న రెండు ఆర్టీసీ బస్సులు నీట మునిగిపోయాయి. పల్లె వెలుగు బస్సు మాత్రం పూర్తిగా మునిగిపోయింది. కండక్టర్ తో సహా ముగ్గురు ప్రయాణికులు మృతి చెందరాని అధికారులు చెబుతున్నారు.
బస్సులపైకి ఎక్కి....
వరద నీటిలో చిక్కుకోవడంతో ప్రయాణికులు బస్సులపైకి ఎక్కారు. తమ ప్రాణాలను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. రాజంపేటలో రహదారులన్నీ నీట మునిగాయి. చెయ్యేరు వాగులో వరద ఉధృతికి నలభై మందికి పైగా కొట్టుకుపోయారని సమాచారం. అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
- Tags
- rtc busses
- flood
Next Story

