Tue Mar 31 2026 14:42:20 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : పోలీస్ స్టేషన్ లో పేలుడు.. పోలీసులకు గాయాలు
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో పేలుడు సంభవించిం

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. మందుగుండు సామగ్రిని పోలీసులు బయట నుంచి తీసుకొచ్చి పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసున్నట్లు సమాచారం. గాయపడిన వారిలో ఎస్సైతో పాటు పోలీసు వాహన డ్రైవర్ దుర్గాంజనేయులు, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి పీఎస్‌లోని ఫర్నిచర్, బయట నిలిపి ఉంచిన వాహనాలు దెబ్బతిన్నాయి. చల్లపల్లి సీఐ కేఎస్ రావు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
హోంమంత్రి దిగ్భ్రాంతి...
కృష్ణా జిల్లాలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ, వెంటనే స్పందించిన మంత్రి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఎస్ఐ దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా సహా ఇతర సిబ్బందికి తక్షణం మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడలోని ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందించాలని అధికారులను సూచించారు. ఘటనకు సంబంధించి సమగ్ర నివేదికను సేకరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.
Next Story

