Tue Dec 16 2025 05:38:12 GMT+0000 (Coordinated Universal Time)
ఏప్రిల్ 7న మంత్రివర్గ విస్తరణ..?
ఏపీ మంత్రి వర్గ విస్తరణ ఏప్రిల్ 7వ తేదీన జరగనుంది. ముందుగా 11వ తేదీన అనుకున్నప్పటికీ విస్తరణను కొంత ముందుకు తెచ్చారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ ఏప్రిల్ 7వ తేదీన జరగనుంది. ముందుగా 11వ తేదీన అనుకున్నప్పటికీ విస్తరణను కొంత ముందుకు తెచ్చారు. దీంతో ఏప్రిల్ ఏడో తేదీన జగన్ తన కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారని తెలిసింది. దీంతో ఎంతోమంది ఆశావహులు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. సీనియర్ నేతల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా కేబినెట్ లో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆశావహుల ప్రయత్నాలు....
సామాజికవర్గాల సమీకరణాల ఆధారంగానే మంత్రివర్గ విస్తరణ జరగనుండటంతో తమకు క్యాస్ట్ కోటాలో మంత్రి పదవి దక్కుుతందని అనేక మంది ఆశిస్తున్నారు. కొందరు మంత్రులు తమను కొనసాగిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న వారిలో ఐదు నుంచి ఆరుమందిని కొనసాగించే అవకాశముందని తెలుస్తోంది.
Next Story

