Sun Apr 05 2026 19:11:55 GMT+0530 (India Standard Time)
అజ్ఞాతంలోకి నందిగం సురేష్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటీవల ఆయనపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు ననమోదయింది. కాకినాడలో ఉన్న ఒక ట్రస్ట్ పునరుద్ధరణకు సంబంధించి ఇరవై ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారన్నఫిర్యాదుతో కేసు నమోదయింది. బాధితులను కూడా బెదిరించినట్లు ఆరోపణలున్నాయి.
పోలీసు కేసుతో...
మొన్న తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా, బాధితులను పిలిచి పోలీసులు విచారించారు. కేసుకు సంబంధించి ఆధారాలను సేకరిస్తున్న సమయంలో తనను అరెస్ట్ చేసే అవకాశముందని భావించిన నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు.ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.
Next Story

