Sat Dec 14 2024 17:15:22 GMT+0000 (Coordinated Universal Time)
Vasireddy Padma: గోరంట్ల మాధవ్‌పై పోలీసులకు వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు
వైసీపీ పార్టీని వీడిన ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
వైసీపీ పార్టీని వీడిన ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్లను మాధవ్ వెల్లడిస్తున్నారని విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబుకు ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అఘాయిత్యానికి గురైన వారి పేర్లను బయటకు చెప్పడం సరైనది కాదని, వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
అత్యాచారాలకు గురైన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, కానీ ఏ మాత్రం అవగాహన లేకుండా అత్యాచారానికి గురైన బాధితుల పేర్లను గోరంట్ల మాధవ్ బయటకు చెప్పారన్నారు. అత్యాచార బాధితుల పట్ల సోయిలేకుండా ఒక మాజీ ఎంపీ ఈ విధంగా మాట్లాడటం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశానని తెలిపారు. గోరంట్ల మాధవ్ పైన సైబర్ క్రైమ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. తన రాజకీయపరమైన నిర్ణయాన్ని మరో వారం రోజుల్లో ప్రకటిస్తానని అన్నారు. తనకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
Next Story