Fri Dec 05 2025 13:38:27 GMT+0000 (Coordinated Universal Time)
Kesineni Nani : మరో బాంబు పేల్చిన కేశినేని.. కసిరెడ్డితో సంబంధాలంటూ?
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి తన సోదరుడు ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి తన సోదరుడు ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన ఎక్స్ లో ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన దిలీప్ పైలాకు, కేశినేని చిన్నికి సంబంధం ఉందని తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ప్రభుత్వ సలహాదారు మరియు ఇప్పుడు ప్రధాన నిందితుడిగా ఉన్న కేశినేని రాజశేఖర్ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ మరియు అతని భార్య జానకి లక్ష్మి కేశినేనితో పాటు ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్ పిలో భాగస్వామి అని పేర్కొన్నారు. ఈ కంపెనీ ప్లాట్ నంబర్ 9, సర్వే నంబర్ 403, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ లో ఉందని తెలిపారు.
కసిరెడ్డి రాజ్ తో...
ముఖ్యంగా కసిరెడ్డి రాజ్ తో పాటు అతని పీఏ దిలీప్ పైలా నిర్వహిస్తున్న ఎషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇదే చిరునామాలో ఉందని తెలిపారు.అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ల్ఎల్ పి మరియు ఎషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండూ ఒకే అధికారిక ఇమెయిల్ ఐడీ ని ఉపయోగిస్తున్నాయని, దీనిబట్టి ఇద్దరిమధ్య సంబంధాలు ఏంటో తెలియకనే తెలుసుకోవచ్చని కేశినేని నాని తెలిపారు. కేశినేనిచిన్ని తన రియల్ ఎస్టేట్ కంపెనీలకు పెద్దమొత్తంలో నిధుల మళ్లింపు జరిగిందని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కేశినేని నాని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.
Next Story

