Tue Jan 21 2025 19:39:54 GMT+0000 (Coordinated Universal Time)
పోలింగ్ బూత్‌లోనే వారికి బుద్ధి చెప్పండి : వెంకయ్య నాయుడు
బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్ లో బుద్ధి చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు నిచ్చారు
బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్ లో బుద్ధి చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు నిచ్చారు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో కొంతమంది అపాస్య పనులు చేస్తున్నారని, వాటిని చూడకుండా ప్రశాంతంగా ఉండాలని, రాజకీయ నాయకులు స్థాయి మరచి చౌకబారు మాటలు మాట్లాడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మధ్య కాలం లో రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్నారని, ఇటువంటి వారికి పోలింగ్ బూత్ లో సమాధానం చెప్పాలని పిలుపు నిచ్చారు.
మళ్లీ విద్యార్థి దశకు....
చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యమన్న ఆయన మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని, మాతృభాష కళ్ళు లాంటిదని, పరాయి భాష కళ్లద్దాలు విలువలతో కూడిన విద్య ఉంటే విలువలతో కూడిన పౌరునిగా తయారవుతారని ఆయన అన్నారు. నేడు విలువలతో కూడిన విద్య తగ్గుతుందని, .ఇది మంచిది కాదని, విలువలతో కూడిన విద్య ను అందించడానికి అందరూ కృషి చేయాలని కోరారు. దేశంలో ఉన్న మేధాశక్తి వలన మరల ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తోందని, భగవంతుడు ఏం కలవాలని అడిగితే మళ్ళీ విద్యార్థి దశకు తీసుకువెళ్లాలని కోరుకుంటానని ఆయన అన్నారు.
Next Story