Thu Mar 19 2026 04:27:07 GMT+0530 (India Standard Time)
YSRCP : వైసీపీకి గుడ్ బై చెప్పిన కిల్లి.. బలమైన కారణం చెప్పి మరీ?
మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు

మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు కేబినెట్ ర్యాంక్ హోదా పదవి ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారని, తర్వాత వైసీపీ అధినాయకత్వం తనను పట్టించుకోలేదని కిల్లి కృపారాణి ఆరోపించారు. గత కొన్నేళ్లుగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నా తనను పట్టించుకోలేదన్నారు.
గౌరవం లేని చోట...
తనను జిల్లా అధ్యక్షురాలిగా ఎందుకు నియమించారో? ఎందుకు తొలగించారో కూడా తనకు తెలియదన్న కిల్లి కృపారాణి వైసీపీలో గౌరవం లభించనందునే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరేదీ త్వరలో వెల్లడిస్తానని ఆమె తెలిపారు. కాగా అందిన సమాచారం మేరకు ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ లోనే ఆమె శ్రీకాకుళం పార్లమెంటు నుంచి ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేశారు.
Next Story

