Mon Dec 15 2025 07:28:05 GMT+0000 (Coordinated Universal Time)
Vemi Reddy : నేడు కీలక ప్రకటన
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేయనున్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేయనున్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తుంటే పార్టీలో జరుగుతున్న వివిధ పరిణామాలు, అవమానాల పట్ల ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. జిల్లాలో ఆశించిన స్థాయిలో కూడా పరిస్థితులు లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన దూరంగా జరిగేందుకు నిర్ణయించుకున్నారు.
పార్టీకి రాజీనామా...
గత వారం రోజులుగా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉంది. ఇప్పటివరకు ఆయన మౌనంగా తన పని తాను చేసుకుని పోతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది రోజుల్లోనే రానున్న నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేక టీడీపీలో చేరతారా? అన్నది నేడు తేలనుంది.
Next Story

