Sun Mar 08 2026 00:13:57 GMT+0530 (India Standard Time)
సీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి
మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు

మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల కోసం ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తామంటే రాయలసీమ ఎమ్మెల్యేలకు ఆ దమ్ములేదా అని ఆయన ప్రశ్నించారు.
రెండు పార్టీలు...
రాయలసీమలో అభివృద్ధి ఏం జరిగిందని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానుల విషయాన్ని పక్కన పెడితే సీమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదన్నారు. టీడీపీ, వైసీపీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు.
Next Story

