Sun Mar 15 2026 19:41:10 GMT+0530 (India Standard Time)
వైఎస్ పై "ఓ సాహసి ప్రయాణం" పుస్తకం : కేవీపీ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలిపారు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ఓ సాహసి ప్రయాణం అనే పుస్తకాన్ని హైదరాబాద్ లో ఆవిష్కరించనున్నామని, ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ తో అనుబంధం ఉన్న వారంతా హాజరవుతారని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా అంపాపురంలో ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నారు.
అనుబంధం మర్చిపోలేనిది....
వైఎస్ వర్థంతి సందర్భంగా పేదలకు చీరలు, పంచెలు పంచి పెట్టారు. విగ్రహావిష్కరణ జరిగిన అనంతరం ఆయన వైఎస్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్ తమ కుటుంబంలో ఏ కార్యం జరిగినా హాజరయ్యేవారన్నారు. అలాగే తన సొంత గ్రామం అభివృద్ధికి కూడా ఆయన సహకరించారన్నారు. నా తండ్రి చనిపోయిన సమయంలోనూ ఆయన వచ్చి తనను పరామర్శించారన్నారు. పోలవరం పూర్తి చేసే సామర్థ్యం ఒక్క వైఎస్సార్ కే ఉందని తన తండ్రి చెప్పేవారన్నారు. వైఎస్ ను ఎన్నడూ మరిచిపోలేమని, ఆయన అభమానుల మనసులో ఎప్పుడూ నిలిచి ఉంటారని చెప్పారు.
Next Story

