Fri Dec 05 2025 15:37:45 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్ కసిరెడ్డిపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి చేసిన ఆరోపణలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి చేసిన ఆరోపణలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డిది కీలక పాత్ర అంటూ విజయసాయిరెడ్డి గతంలో ఆరోపణ చేశారు. అయితే దీనిపై రాజ్ కసిరెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి బాగోతం బయటపెడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి నేడు ట్వీట్ తో దీటుగా బదులిచ్చారు.
లిక్కర్ కేసులో...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో తన పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమేనని, ఇందులో తప్పించుకునేందుకు దొరికిన దొంగలు, దొరకని దొంగలు తన పేరును లాగుతున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. లిక్కర్ స్కామ్ లో అసలు దొంగలను బయటకు లాక్కొచ్చేందుకు తాను సహకరిస్తానంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
Next Story

