Mon Mar 16 2026 08:00:46 GMT+0530 (India Standard Time)
పవన్ మాతో కలసి రావడం లేదు : బీజేపీ
జనసేనతో పొత్తు ఉన్నా లేనట్లే ఉన్నామని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత మాధవ్ అన్నారు. తమ మధ్య గ్యాప్ ఉందని అన్నారు.

జనసేనతో పొత్తు ఉన్నా లేనట్లే ఉన్నామని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత మాధవ్ అన్నారు. పవన్ తమతో కలసి రావడం లేదనే తమ ఆరోపణ అని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చి సహకరించాలని పవన్ కల్యాణ్ ను కోరామని, ఆయనే కలసి రాలేదని అన్నారు. జనసేన, బీజేపీకి మధ్య గ్యాప్ ఉన్న మాట వాస్తవేనని అన్నారు.
గ్యాప్ ఉన్న మాట వాస్తవమే...
తాము పొత్తు ఉన్నా లేనట్లే ఎవరి పాటికి వారు తిరుగుతూ పొత్తు ఉందని చెబితే ప్రజలు నమ్మరన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పారే కాని బీజేపీి అభ్యర్థికి ఓటు వేయమని చెప్పలేదని మాధవ్ అన్నారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం తామే అని అన్నారు. మే నెలలో తాము వైసీపీ ప్రభుత్వంపై ఛార్జిషీట్ వేస్తామని మాధవ్ తెలిపారు. పొత్తుల విషయం హైకమాండ్ చూసుకుంటుందన్నారు.
Next Story

