Sun Mar 15 2026 19:39:46 GMT+0530 (India Standard Time)
పవన్ అనంతపురంలో పోటీ చేయి
చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ అనంతపురంలో పోటీ చేస్తే ఆయన గెలుపునకు సహకరిస్తానని తెలిపారు. గతంలోనూ టీడీపీ, జనసేన పొత్తు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈసారి కూడా కలసి పోటీ చేస్తే బాగుంటుందని రెండు పార్టీల కార్యకర్తలు, అభిమానులు భావిస్తున్నారని ప్రభాకర్ చౌదరి తెలిపారు.
ఇద్దరి లక్ష్యం...
జగన్ ను ఇంటికి పంపడం, వైసీపీ ప్రభుత్వాన్ని దించడమే రెండు పార్టీల లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తనకు ఎన్నికల వ్యూహం వేరే ఉందని పవన్ చెప్పిన విషయాన్ని కూడా ప్రభాకర్ చౌదరి గుర్తు చేశారు. పవన్ ను తాను అనంతపురంలో పోటీ చేయమని కోరుతున్నానని ఆయన అన్నారు.
Next Story

