Fri Dec 05 2025 11:19:26 GMT+0000 (Coordinated Universal Time)
తాడిపత్రి పెద్దారెడ్డికి పెద్ద ఊరట
సుప్రీంకోర్టు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ ఊరట లభించింది. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

సుప్రీంకోర్టు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ ఊరట లభించింది. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.
తాడిపత్రికి వెళ్లేందుకు...
తనను తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం విచారించింది. అయితే ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాడిపత్రికి వెళ్లేందుకు ఎవరి అనుమతి కావాలని ప్రశ్నించింది. అవసరమైతే ప్రయివేటు సెక్యూరిటీని పెట్టుకుని వెళ్లాలని చెప్పింది. పోలీసులు కూడా భద్రత కల్పించాలని ఆదేశాలిచ్చింది. పెద్దారెడ్డి భద్రతకు అవసరమైన అన్ని ఖర్చులు తామే భరిస్తామని పెద్దారెడ్డి తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు
Next Story

