Wed Dec 17 2025 14:08:41 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు హ్యాపీ అట!!
ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నానని

ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ప్రజల తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే కొందరు అసలు తట్టుకోలేరు. అయితే తెలంగాణ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం ఓడిపోయినందుకు చాలా హ్యాపీ అంటూ చెబుతుండడం కొందరికి షాక్ ఇస్తోంది. అయితే ఈయన కోసం కష్టపడిన కార్యకర్తలతో ఎన్నికలకు ముందు ఇదే మాట చెప్పగలరా? ఓడిపోయినా నేను హ్యాపీగా ఉంటాను.. మీరు కష్టపడవద్దు అని చెప్పే ధైర్యం జగ్గా రెడ్డికి ఉందా అని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు.
కూతురు పెళ్లి.. కొడుకును సెటిల్ చేయాలి:
ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నానని జగ్గా రెడ్డి చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో తాను రిలాక్స్ అవుతున్నానని, తాను ఓడిపోయానని నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా బాధపడొద్దని జగ్గారెడ్డి కోరారు. మన ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి పనులు చేసుకుందామని చెప్పారు. కార్యకర్తలు ఎవరూ గాంధీభవన్ కి రావొద్దని.. మీరు గాంధీభవన్ వస్తే కలవలేను, మాట్లాడలేనని అన్నారు. నా కూతురికి పెళ్లి చెయ్యాలి, కొడుకు బిజినెస్ పెడతా డబ్బులు కావాలంటున్నాడన్నారు. అప్పులు తీర్చడానికే నా జీవితం సరిపోతుందని ఆయన వాపోయారు. 20 ఏళ్లలో సంగారెడ్డిలో బోనాలు, దసరా ఉత్సవాల కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశాను అని జగ్గారెడ్డి తెలిపారు.
Next Story

