Sun Mar 22 2026 17:00:42 GMT+0530 (India Standard Time)
చింతమనేని హౌస్ అరెస్ట్
అమరావతి రైతుల మహాపాదయాత్రకు గుడివాడ వెళుతున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు

గుడివాడలో జరుగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్రకు వెళుతున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు అమరావతి రైతుల పాదయాత్ర గుడివాడకు వస్తుండటంతో చింతమనేని కూడా రైతులకు సంఘీభావం తెలిపేందుకు గుడివాడ బయలుదేరారు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు ఆయనకు ముందుగానే నోటీసులు జారీ చేశారు.
గుడివాడకు వెళతారని...
దెందులూరులోని చింతమనేని ప్రభాకర్ నివాసం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. చింతమనేని వెళితే అక్కడ గొడవలు జరుగుతాయని భావించిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దీంతో చింతమనేని కూడా తాను పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాలని, సమావేశం ఉందని చెప్పినా పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Next Story

