Sun Mar 15 2026 08:56:22 GMT+0530 (India Standard Time)
బైక్ మీద గుడివాడకు చింతమనేని
గుడివాడలో జరుగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్రకు చింతమనేని చేరుకున్నారు. పోలీసులు కళ్లుకప్పి ఆయన గుడివాడ చేరుకున్నారు.

గుడివాడలో జరుగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్రకు చింతమనేని చేరుకున్నారు. పోలీసులు కళ్లుకప్పి ఆయన గుడివాడ చేరుకున్నారు. బైక్ మీద ప్రయాణించి ఆయన గుడివాడకు చేరకున్నారు. రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్నారు. చింతమనేని ప్రభాకర్ ను చూసిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలు జై చింతమనేని అంటూ నినాదాలు చేశారు. పోలీసుల వలయం నుంచి తప్పించుకుని ఎట్టకేలకు ఆయన గుడివాడకు చేరుకున్నారు.
గుడివాడలో ఉద్రిక్తత...
రైతుల మహాపాదయాత్ర గుడివాడలోని వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకోగానే ఉద్రిక్తత నెలకొంది. కళాకారులు పాటలు ఆపాలని పోలీసులు కోరారు. ఆపకపోవడంతో కళాకారులను అవతలి వైపునకు నెట్టివేశారు. మరోవైపు వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండటంతో టెన్షన్ నెలకొంది. పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రెండు వర్గాలు తలపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రైతుల మహా పాదయాత్ర వైసీపీ కార్యాలయం దాటి వెళ్లడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story

