Fri Dec 05 2025 12:39:35 GMT+0000 (Coordinated Universal Time)
చెవిరెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. చెవిరెడ్డిని ఈ కేసులో A38 గా చేరుస్తూ కోర్టులో మెమోను స్పెషల్ ఇన్విస్టిటేషన్ దాఖలు చేసింది. ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి కొలొంబో వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ కు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
లుక్ అవుట్ నోటీసులు ఉండటంతో...
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు ఇప్పటికే సిట్ అధికారులు జారీ చేయడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు నుంచి విజయవాడకు తీసుకు వస్తున్నారు.
Next Story

