Wed Dec 17 2025 12:55:18 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ పాదయాత్రకు అనుమతిస్తే మంచిది.. లేకుంటే?
ముందస్తు అనుమతి తీసుకున్నా చంద్రబాబును కుప్పంలో ఎందుకు అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు

ముందస్తు అనుమతి తీసుకున్నా చంద్రబాబును కుప్పంలో ఎందుకు అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. చీకటి జీవోపై తప్పుడు ప్రచారం చేస్తున్నది ప్రభుత్వమేనని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడిషనల్ డీజీ రవిశంకర్ తో చీకటి జీవోపై ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. విధిలేక ఆయన కూడా జీవోపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారన్నారు.
చీకటి జీవోను తెచ్చి....
చంద్రబాబు కుప్పం పర్యటనకు ముందుగానే అనుమతి తీసుకున్నా ఆయనను జిల్లా సరిహద్దుల్లోనే ఎందుకు అడ్డుకున్నారని బొండా ఉమ ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే చీకటి జీవోను తెచ్చారన్నది అందరికీ అర్ధమయిందన్నారు. జగన్ రెడ్డి వచ్చాకే రాష్ట్రంలో రోడ్ షోలు, బహిరంగసభలు జరుగుతున్నాయా? అంతకుముందు లేవా? అని ఆయన నిలదీశారు. లోకేష్ పాదయాత్రకు కాకమ్మ కథలు చెప్పకుండా అనుమతిస్తే బాగుంటుందని సూచించారు. అలా కాకుండా పక్షపాతంగా వ్యవహరిస్తే న్యాయస్థానాలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
Next Story

