Sat Mar 21 2026 03:16:50 GMT+0530 (India Standard Time)
టీడీపీ అధికారంలోకి రాగానే
బీసీ జనగణన చేపట్టడం కుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు

బీసీ జనగణన చేపట్టడం కుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ కు బీసీల అభివృద్ధి ఇష్టం లేదన్న ఆయన అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారన్నారు. బీహార్ లో అక్కడి ప్రభుత్వం జనగణన ప్రారంభించి పూర్తి చేసిందన్న యనమల రామకృష్ణుడు ఇక్కడ మాత్రం అసలు మొదలు పెట్టలేదన్నారు.
బీసీ జనగణన...
తెలుగుదేశం పార్టీ అధకారంలోకి వస్తే తాము బీసీల జనగణన చేస్తామని యనమల రామకృష్ణుడు తెలిపారు. తెలుగుదేశం మహానాడులోనూ బీసీ జనగణనపై తీర్మానం చేశామని ఆయన గుర్తు చేశారు. బీసీ జనగణనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఇక్కడ వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు.
Next Story

