Fri Dec 05 2025 13:18:18 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రులను మార్చినా ఇక ప్రయోజనం లేదు
ఈ ఎన్నికల ఫలితాలే సాధారణ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు

ఈ ఎన్నికల ఫలితాలే సాధారణ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సాధారణ ఎన్నికల్లో రిపీట్ కాక తప్పదన్నారు. వైసీపీ పతనం పారంభమయ్యాక ఇక ఆగడం ఉండదని తెలిపారు. సీఎం జగన్ ఇప్పుడున్న మంత్రులను మార్చి కొత్త మంత్రులను పెట్టినా ఆ పార్టీకి ఒరిగేదేమి లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
అమరావతే రాజధాని...
మరో వైపు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైసీపీ స్వార్థ ప్రయోజనాల కోసం, నాయకుల అక్రమార్జన కోసమే మూడు రాజధానుల ప్రకటన అని ప్రజలే తేల్చారన్నారు. అమరావతి ఏకైక రాజధాని అని రుజువైందని కన్నా వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంలో టీడీపీ ఆధిక్యం ప్రజల నిర్ణయాన్ని స్పష్టం చేస్తోందని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
Next Story

